Tuesday, November 26, 2024

నేటి నుంచి విశాఖ న‌గ‌రిలో జి 20 స‌దస్సు..

విశాఖపట్నం, ప్రభ న్యూస్‌: విశ్వనగరి విశాఖ వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు- జి-20 సదస్సు నిర్వహించను న్నారు. దీనికి సంబంధిం చి అన్ని ఏర్పాట్లు- పూర్త య్యాయి. వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ,వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో..నగరంలోని రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో ఈ నెల 28,29,30వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచే వివిధ దేశాల నుంచి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. సదస్సు ద్వారా విశాఖనగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు- చేశారు. విశాఖ బ్రాండ్‌ మరింత పెంచేలా..దేశం గర్వించేలా సదస్సును సర్వం సిద్దం చేసేవారు.
జి-20దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక జీ-20 సదస్సు ఏడాది డిసెంబర్‌లో ఇండియాలో జరగనుంది. ఈలోగా వివిధ రంగాలకు సంబంధించిన వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగతీనెల 3,4తేదీల్లో జాతీయ స్థాయిలో జరిగిన తొలిదశ జీ-20ఇన్‌ఫ్రాక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు విజయవంతమైంది.మలివిడత జీ-20 శిఖరాగ్ర సదస్సుకు మహావిశాఖనగరం అతిథ్యం ఇస్తోంది.40దేశాల నుంచి 200మంది వరకూ దేశవిదేశీ ప్రతినిధులు, పలుదేశాల ఆర్ధిక మంత్రులు, విదేశాంగ మంత్రులు,సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు- చేస్తున్నారు. వివిధ దేశాలనుంచి విశాఖవచ్చే అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు- చేశారు.అతిథుల రోజువారీ కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టారు. వారు బస చేయు హోటల్‌ వద్ద 24/7 హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు- చేశారు.ఈ హెల్ప్‌ డెస్క్‌లో రెవెన్యూ, జీవీఎంసీ, మెడికల్‌, పర్యాటకశాఖలకు సంబంధించిన సిబ్బందిని అందుబాటు-లో ఉండేలా 3 షిప్టలుగా పనిచేసేలా మొత్తం 15 లైజన్‌ అధికారుల కమిటీ- పర్యవేక్షణ చేస్తున్నాయి. ప్రస్తుతం28,29,30తేదీల్లో మూడు రోజులు జీ-20శిఖరాగ్ర సదస్సులో పలు దేశాలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తూ తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచుకోనున్నారు.

భేష్‌గా ఏర్పాట్లు- పూర్తి
కేంద్ర ప్రత్యేక కార్యదర్శి శాల్మన్‌ ఆరోగ్యరాజ్‌, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సుకు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహించి ఘనంగా ఏర్పాట్లు- పూర్తి చేశారు. సదస్సులో సీఎం జగన్‌తో సహా కేంద్ర మంత్రులు,కేంద్ర ఉన్నతాధి కారులు,ఇతర రాష్ట్రాల్రకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.డిజిటల్‌ ఇండియా..హరిత అభివృద్ధితో పాటు-గా మహిళా సాధి కారత,యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు. వివిధ దేశాల నుంచి జీ-20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను కోసం నగరాన్ని మహా సుందరంగా తీర్చిదిద్దారు.

జీ-20కి అధ్యక్షతగా ఇండియా
ఈ ఏడాది జీ-20దేశాల సదస్సులకు భారతదేశం అధికారికంగా డిసెంబర్‌ 1,2022న జి-20 సదస్సుకు అధ్యక్ష పదవిని చేపట్టింది. జీ20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తోంది.డిజిటల్‌ పరివర్తన,హరిత అభివృద్ధి, మహిళా సాధికారత,యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు ఈ అవకాశం దక్కింది.

జీ-20 సదస్సు అంటే ఏంటీ- ?
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు,అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల 20 దేశాల అధినేతల వార్షిక సమా వేశమే (గ్రూప్‌ ఆఫ్‌ గ్లోబల్‌ కంట్రీ-స్‌ జీ-20) సదస్సు.ఇది అంతర్జాతీయ సంస్థల్లో అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడిరట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాను జీ-20కలిగి ఉంది.మొట్టమొదటి జీ-20సదస్సు 1999లో బెర్లిన్‌లో జరిగింది. మొదట్లో జీ-20 సదస్సుకు ప్రధానంగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు,సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూలడం,నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో మాంద్యం నెలకొనడంతో జీ-20 సభ్యదేశాల అధ్యక్షులు,ప్రధానమంత్రులతో ఒకఅత్యవసర మండలిగా మారింది. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్‌లో జరిగింది. ఏదేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు- చేయడం..ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. జీ-20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు,కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండుసార్లు సమావేశమై అనేక అంశా లపై చర్చిస్తారు.ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థలు వరల్డ్‌ బ్యాంక్‌,ఐరాస,అంతర్జాతీయ కార్మిక సంస్థ,ఓఈసీడీ,డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్‌,డబ్ల్యూటీ-వో, ఫైనాన్షి యల్‌ స్టెబిలిటీ- బోర్డు,ఆసియా డెవలప్‌మెంట్‌బ్యాంక్‌ అధికారులు హజరుకానున్నారు.

- Advertisement -

సభ్యు దేశాలు ఇవే
జీ 20లో ఇరవై సభ్య దేశాలు ఉన్నాయి. అర్జెంటీ-నా, ఆస్ట్రేల్రియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండియా, ఇండొనేసియా, ఇటలీ,జపాన్‌,మెక్సికో,రష్యా,సౌదీ అరేబియా,సౌత్‌ ఆఫ్రికా,సౌత్‌ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా,యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నాయి. జీ20లో ఉన్న దేశాలు మాత్రమే కాకుండా, ఆసక్తి ఉన్న ఇతర దేశాలు సైతం ఈ సదస్సుకు హజరుకానున్నాయి.వీరంతా గ్లోబల్‌ సౌత్‌ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఆయా దేశాల అనుభవాలు,విజయగాథలపై సదస్సులో చర్చించనున్నారు.

బృందం ఏం చర్చిస్తుంది?
ప్రస్తుతం ఎదుర్కొంటు-న్న అతి ముఖ్యమైన ఆర్థిక అంశాలు,సమస్యల గురించి ఈ భేటీ-కి హాజరైన ప్రపంచ నాయకులు చర్చిస్తారు.అనంతరం గ్రూప్‌ సభ్య దేశాల ప్రణాళికల మధ్య సమన్వయం ఉండేలా చేయటానికి ప్రయత్నిస్తారు.వాణిజ్యం,వాతావరణ మార్పులు వంటి కూడా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ సదస్సు నేపథ్యంలో సమాంతరంగా పలు సభ్య దేశాల మధ్య దె్వపాక్షిక సమావేశాలు కూడా జరుగుతుంటాయి. వాటిలో ఆయా దేశాల అధినేతలు చాలా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుపునున్నారు.

లక్ష్యాలు
సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాలను పెంపొం దించడం. భవిష్యత్తులో ఆర్థిక సంక్షౌభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీక రించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం.

28న సీఎం రాక
దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. 28నసాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి..5.15గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ చేరుకుని..7 నుంచి 8 గంటల మధ్య జీ-20డెలిగేట్స్‌తో జరిగే ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement