Saturday, November 23, 2024

ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల

పోలవరం, (ఏలూరు) ,ప్రభ న్యూస్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో కొవ్వాడ, ఇసుక కాల్వ పోటెత్తుతున్నాయి. ఈ రెండూ గోదావరిలో పట్టిసీమ వద్ద కలుస్తాయి. భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరిగింది. దీంతో 48 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద శనివారం 28.640 మీటర్లు,దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 18.505 మీటర్లు ఉన్న నీటిమట్టం అనూహ్యంగా పెరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 29.660 మీటర్లు,దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 19.050 మీటర్లకి చేరింది. సిడబ్ల్యుసి వద్ద 19.357 అడుగుల నీటిమట్టం నమోదైంది.

దాంతో. అధికారులు ప్రాజేక్టు 48 గేట్ల నుండి గంటకు లక్ష 98 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పోలవరం, పట్టిసీమ, దిగువన గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. .భద్రాచలం వద్ద సాయంత్రం 36 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. రాత్రికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రమాదం దృష్ట్యా ఇప్పటికే 19 గిరిజన గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement