నెల్లూరు ప్రతినిధి, ప్రభన్యూస్: ఊరు, పల్లెలకు ఉండే పేర్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా.? చాలా వింతగా ఉండే పేర్లు ఉంటాయి కదూ.. కొన్ని విలేజ్ నేమ్స్ అయితే పలకడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిలో శృంగవరపు కోట.. నువ్వునాకిన పాలెం, దొంగలసింగారం వంటివి చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటిదే మరో ఊరు పేరు నెల్లూరు జిల్లాలో ఉంది. అదేంటంటే..
కల్తీ అంటే మంచిది కాదని.. ఒక పదార్థం.. అదే విధంగా ఉండే ఇంకో నకిలీ పదార్థం కలిపితే కల్తీ అంటారని అందరికీ తెలిసిందే. అయితే.. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో ప్రసిద్ది చెందిన గాంధీ ఆశ్రమానికి వెళ్లే దారిలో ఓ కాలనీకి అక్కడి ప్రజలు ‘‘కల్తీ కాలనీ’’గా నామకరణం చేసుకున్నారు.
ఒక కులానికో వర్గానికో పరిమితం కాకుండా అన్నీ కులాలు, అన్నీ మతాలు కలిసి జీవిస్తున్నామని.. రక రకాల వ్యక్తులు కలిసి ఉన్నందువలన వ్యావహారికంగా కల్తీ కాలనీ అని పిలుస్తూ.. చివరకు ఆ పేరే స్థిరపడిపోయిందని అక్కడ ప్రజలు చెబుతున్నారు. అయితే కొంతమంది యువకులు ఈ ఊరు పేరు చెప్పుకోవడం తమకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..