Friday, November 22, 2024

Funds: ఏపీ, తెలంగాణ ఇవ్వాల్సిన నిధుల పై… కృష్ణాన‌దీ యాజ‌మాన్య‌బోర్డు వీడీయో కాన్ఫ‌రెన్స్‌

ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం కానుంది. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45.63 కోట్ల నిధులు రాగా.. 45.45 కోట్లు ఖర్చు చేశారు.

అందులో ఏపీ 24.91 కోట్లు, తెలంగాణ 19.71 కోట్లు, కేంద్రం కోటి ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్లు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ 3.35 కోట్లు ఇచ్చింది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్‌ను 23.5 కోట్లుగా ఖరారు చేశారు. అందులో వేతనాల ఖర్చు 12.7 కోట్లుగా ఉంది. అంటే నెలకు కోటి రూపాయలకుపైగా వేతనాలకు. ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద 22లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలు.. చెల్లించే పరిస్థితి లేదని కృష్ణా బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. నిధుల విషయమై రెండు రాష్ట్రాలకు లేఖ రాస్తామని.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement