ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. కాగా, తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకానికి నిధులు విడుదల చేసింది. ఉచిత గ్యాస్ సిలిండ్ పథకానికి సంబంధించి తొలివిడతలో రూ.895 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల ఉమ్మడి ఖాతాలకు నిధులు సమకూరుస్తుంది.
ఇక, ఈ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నారు. అయితే ముందుగా వినియోగదారులు గ్యాస్ సిలిండర్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ఎకౌంట్లలో నగదు జమ చేస్తుంది. పట్టణ ప్రాంతాలు వారికి… పేమెంట్ చెల్లించిన 24 గంటల్లో డీబీటీ ద్వారా డబ్బును జమ చేస్తుంది. అదే, గ్రామాల్లోని వారికి 48 గంటల్లో నగదు జమ అవుతుంది.