విశాఖపట్నం – మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తెలుగు యూట్యూబర్, ఫన్ బకెట్ భార్గవ్‌కి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. దీనిపై నేడు విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్‌కి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది.
టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు భార్గవ్. అనంతరం ఫన్ బకెట్ అంటూ యూట్యూబ్‌లో ఫన్ వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో వీడియోలు తీసే క్రమంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయంపై బాలిక తల్లి 2021లో పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్గవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
గత నాలుగు ఏండ్లుగా విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ కొనసాగగా.. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో నేడు విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.