Saturday, November 23, 2024

Full Power: పల్లెల్లోనూ పరిశ్రమలు.. ఐదు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టు..

అమరావతి, ఆంధ్రప్రభ: పల్లెల్లో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిసేలా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎంఎస్‌ఎంఈ పార్కులను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం జగన్‌, ఆమేరకు తన కార్యాచరణ ప్రణాళికను ఆచరణలో ప్రారంభించి నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉన్న గ్రామాల్లో ఇకపై త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలని సంకల్పించారు. ఇప్పటికే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావించి, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే వ్యవసాయ ఉత్ప త్తులకు కేంద్ర బిందువులన గ్రామాల్లోనే పారిశ్రా మిక విప్లవం తీసుకొస్తే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు కొత్త నిర్వచనం చెప్పవచ్చనది ముఖ్యమంత్రి అభిమతంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంపికచేసిన గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణ యించారు. ఆమేరకు కార్యాచరణ కూడా ప్రారంభ మైంది. ఈ కార్యక్రమం విజయవంత మైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అందించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు డిస్కమ్‌లకు కూడా దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు రాజ్యమేలనున్నాయి. ఫలితంగా పంట పండించే రైతులకు మంచి లాభాలు రానున్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించే రైతన్నలకు నష్టాలనేవి రాకుండా ఉండాలంటే అటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను మరింతగా ప్రోత్సహించడంతోపాటు ఇటు ఎంఎస్‌ఎం ఈ పార్కులను విరిగా ఏర్పాటు చేయడమే ఏకైక మార్గమని సీఎం జగన్‌ భావించిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది.

ముందుగా ఐదు జిల్లాల్లో
కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ను ఆధారం చేసుకుని చిన్నపాటి పరిశ్రమలు నెల్పాలన్నా గ్రామాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. రానున్న రోజుల్లో ఆ పరిస్థితి తొలగిపోనున్నది. ప్రతి గ్రామానికీ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కలగబోతోంది. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లోని 123 గ్రామాల్లో ఈ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా కోసం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి వీటిని పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ రూపొం దించారు. ఇందుకోసం రూ. 44 కోట్లను వెచ్చిస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పనుంది. తొలి దశలో 5 వేల జనాభా దాగిన ప్రతి గ్రామానీకి త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేసేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. ఇందుకు అవసరమైన 11 కేవీ విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఎంఎస్‌ఎంఈలకు ఊపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక తోడ్పాటును అందింస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈనేపథ్యంలో గ్రామాల్లోనే ఎక్కువగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యేలా త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా పనులను ప్రభుత్వం ప్రారంభించింది. వాస్తవానికి ప్రస్తుతం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరానే ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది. అక్కడక్కడా త్రీ ఫేజ్‌ విద్యుత్‌ఇస్తున్నా కేలం కొన్ని గంటలే సరఫరా అవుతోంది. దీంతో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలూఆర్ధకంగా నిలదొక్కుకోవ డం కష్టమౌతోంది. తొలి దశలో 5 వేలకుపైగా జనాభా గల గ్రామాల్లో త్రీ ఫేజ్‌ సరఫరా పనులు కొనసాగుతున్నాయి. అనంతరం 5 వేల లోపు జనాభా ఉన్న గ్రా మాలకూ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఇవ్వాలనే ఆలోచనలో డిస్కంలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement