ఒంగోలు, ప్రభన్యూస్ : గత కొన్ని రోజులుగా లిక్కరు ధరలను పెంచుతూ పోయిన ప్రభుత్వం కాస్త వెనక్కి తక్కింది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా తగ్గించింది. మద్యం ప్రియులకు కొత్త కిక్కునిచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం ధరలు గణనీయంగా పడిపోయింది. తగ్గిన ధరలతో విక్రయాలు పెరిగి ప్రభుత్వ ఖజానాకు మరింత రాబడిని తీసుకొస్తుందా..? మద్యం ధరల తగ్గింపు పై ప్రభుత్వం వ్యూహం ఏమిటి..! క్వార్టర్ పై రూ.30 నుంచి రూ.100 వరకు తగ్గింది. బీర్లు ధరలు రూ.20 వరకు తగ్గాయి.
రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గడంతో మద్యం ప్రియులు ఎగిరి గంతేస్తున్నారు. ఆదివారం నుంచే తగ్గిర ధరలు అమల్లోకి రావడంతో ఉదయం నుంచే వైన్ షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. మద్యం ధరలు తగ్గడంతో జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కలకలలాడుతున్నాయి. ధరలు దిగిరావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరో వైపు ధరలు తగ్గడంతో విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అక్రమ రవాణా స్మగ్లింగ్, నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital