Sunday, November 24, 2024

AP | లిక్కర్ షాపులతో ఫుల్ ఆదాయం.. దరఖాస్తులు ఎన్నో తెలుసా..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులకు స్వీకరించగా… నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం భారీ స్పందన కనిపించింది. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలు ఉండ‌గా.. గడువు ముగిసే సమయానికి 87,116 దరఖాస్తులు దాఖలయ్యాయి. కాగా, మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 1742.32 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 వైన్ షాపుల కోసం 5,764 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా అల్లూరి జిల్లాలోని 40 దుకాణాలకు 1,179 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14వ తేదీన మద్యం దుకాణాల కేటాయింపు కోసం అధికారులు లాటరీ నిర్వహించనున్నారు. అనంతరం, ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement