Monday, November 25, 2024

AP | ఎస్ఐ నుంచి సబ్ కలెక్టర్ స్థాయికి.. కష్టపడి చదివితే ల‌క్ష్యం సాధించ‌వ‌చ్చు

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్): అనేక ఆటుపోట్లు, సమస్యలను ఎదుర్కొని ఉన్నత లక్ష్యం కోసం కష్టపడి చదివితే ఈజీగా అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఆమె. ఉన్నత పదవితో పాటు పదిమందికి సేవ చేయాలన్నదే ఆమె లక్ష్యం.. ఆమె ఎవరో కాదు. సత్య సాయి జిల్లా హిందూపురం సమీపంలోని గురవహళ్లికి చెందిన ఎస్ఐ స్వాతి. 2018లో తిరుపతి ఇన్ స్పెక్ట‌ర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గాజుల మండలం పోలీస్ స్టేషన్ లో పనిచేశారు. తదనంతరం శ్రీకాళహస్తి టూ టౌన్ కు బదిలీపై వెళ్లారు.

అక్కడి నుంచి తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఒంగోలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మహేష్ తో వివాహం చేసుకున్నారు. 2022లో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యి ఎలాగైనా ర్యాంకు సాధించాలని ఎస్ఐ స్వాతి ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఇలా రాష్ట్రస్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించి ఇప్పుడు స‌బ్ క‌లెక్ట‌ర్ స్థాయికి ఎదిగారు. తన‌కు ర్యాంకు రావడంపై సంతోషంగా ఉందని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం రావ‌డం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement