Wednesday, November 20, 2024

AP : ఇంటి వద్ద నుంచే…అరచేతిలో డిస్కం సేవలు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

తిరుపతి, నవంబర్ 6 (ప్రభ న్యూస్ బ్యూరో)
డిస్కంల పరిధిలో వినియోగదారులు, రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు పారదర్శకంగా, వేగంగా అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది..అందులో భాగంగా సోమవారం విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విద్యుత్తు వినియోగదారుల కోసం డిస్కం రూపొందించిన రైతు నేస్తం, వాట్స్ అప్, చాట్ బాట్ యాప్ లను ఆవిష్కరించారు. వినియోగదారులు విద్యుత్తు శాఖకు సంబంధించి అన్ని రకాల సేవల కోసం 9133331912 వాట్స్ యాప్ చేయండి…ఇంటి నుంచి సేవలు పొందండి..అంటూ మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో మంత్రి తో పాటు డిప్యూటీ సి ఎం నారాయణ స్వామి, డిస్కం సి ఎం డి సంతోష రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తన క్యామ్ప్ కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో కొత్త విద్యుత్తు సర్వీసుల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగే వారన్నారు. కొత్త సర్వీస్ కావాలంటే వినియోగదారులు నానా అవస్థలు పడే వారని విమర్శించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సత్వరం, వేగంగా, పారదర్శకంగా రైతులకు అవసరమైన కొత్త విద్యుత్తు సర్వీసులకు దరకాస్తూ చేసిన వెంటనే 30 రోజుల వ్యవధిలో కొత్త విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు..గత ప్రభుత్వ హయాంలో ఎన్నో విద్యుత్తు కనెక్షన్ల కోసం ధరకాస్తులు పెండింగ్ లో వుందేవన్నారు. దీనిపై ఇటీవల ముగ్గురు సి ఎం డి లతో సమీక్షలు చేసి పెండింగ్ ధరకాస్తులు పరిస్కారం చేశామన్నారు.గత నాలుగు సంవత్సరాల కాలం లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం లో 3,70,196 కోట్ల విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అదే టీడీపీ ప్రభుత్వం అధికారం దిగి పోయే రోజుకు 1,15,529 ధరకాస్తులు పెండింగ్ లో ఉండగా మా ప్రభుత్వం హయాం లో ఇప్పటి వరకు పెండింగ్ ధరకాస్తులు పూర్తిగా పరిష్కరించి రైతు ప్రభుత్వం గా పేరు తెచుకున్నామని చెప్పారు. అలాగే తాము ఇప్పటివరకు కొత్త విద్యుత్తు సర్వీస్ ల కోసం 3 డిస్కం ల పరిధిలో రూ 16 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం లో రూ 1478 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మ‌ర్‌ కాలిన, పేలిన, మరమ్మతులకు గురైనా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లో పరిస్కారం చేయడం జరుగుతుందన్నారు. ఈ యాప్ ఆవిష్కరణ సమావేశం లో ఎస్ ఈ కృష్ణా రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు అశోక్ కుమార్, డిస్కం డైరెక్టర్ సుబ్బరాజు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement