Friday, November 22, 2024

TTD: ఈనెల 23 నుండి జనవరి 1వరకు వైకుంఠ ద్వార దర్శనం…ఇఓ దర్మారెడ్డి

తిరుమల : ఈనెల 23 నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరని తెలిపారు. జనవరి 14వతేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేసారన్నారు. నెల రోజులు పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహిస్తారన్నారు.

ఇక, వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా.. అన్ని రోజులూ సమానమేనన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాలని కోరారు. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తుందన్నారు. సిఫారసు లేఖలు స్వీకరించమని స్పష్టం చేశారు. వీఐపీలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. టోకేన్ లేని భక్తులు తిరుమలకు విచ్చేసినా వారికి వసతి, దర్శన సౌకర్యం లభించదని.. 23వ తేదీ ఉదయం 9 గంటలకు స్వర్ణరథం ఉరేగింపు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement