అమరావతి,ఆంధ్రప్రభ: సంక్రాంతి సెలవుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. మొదటిగా జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఆరురోజుల పాటు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అయితే మరీ ఆరు రోజులే అంటే సరిపోవని, అదీ కాక విద్యార్ధుులు 17వ తారీఖు క్లాసులకు రావాలంటే దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కనుమ రోజే బయల్దేరాల్సి ఉంటుందని, ఇది ఇబ్బందిగా ఉంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాయి.
దీంతో సెలవుల షెడ్యూల్‌ను మార్చారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంత్రి సెలవులుగా ప్రకటించారు. మొత్తం ఏడు రోజులు సెలవులు ఉంటాయని, అదనంగా ఒకరోజు ఇచ్చిన సెలవును ఆ తర్వాత సెలవు రోజు పని చేసి భర్తీ చేయాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.