Monday, June 24, 2024

AP | ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు..

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ కళాశాలలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ గురుకుల పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా తెలుగు అకాడమీ నుంచి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌బుక్‌లు, బ్యాగులు సరఫరా చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement