అమరావతి, ఆంధ్రప్రభ: ఉచిత నిర్భంధ విద్యా చట్టంలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి ప్రయివేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయింపునకు అర్హులను ఈనెల 21వ తేదీన మొదటి జాబితా ప్రకటిస్తామని పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తను పూర్తి చేసినట్లు, మొదటి జాబితా వివరాలను ఈనెల 21వ తేదీన cse.ap.gov.in లో చూసుకోవచ్చునని గురువారం ఆ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. మొదటి జాబితాతో నిర్దేశిత కోటా 25 శాతం పూర్తి కానట్టయితే ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీలోపు రెండో జాబితాలో అర్హులను ఎంపిక చేసి మొదటి తరగతిలోకి ప్రవేశాలు నిర్వహిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement