Saturday, November 30, 2024

Free Gas – మహిళలకు సీఎం చంద్రన్న దీపావ‌ళి కానుక

ఏపీలో దీపం-2 – దీపావళి నుంచి వెలుగులు
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల బొనాంజ
తొలి విడతగా పెట్రోలియం సంస్థలకు ₹894 కోట్లు అందజేత
ఏడాదికి దీపం పథకం కోసం ₹2, 684 కోట్ల భారం
నవంబర్ 1న శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు ప్రారంభం

ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి :
సూపర్ సిక్స్ హామీల్లో కీలక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపం-2 పథకానికి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. బుధవారం సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సీఎం ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. కాగా, నవంబర్​ 1వ తేదీన శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్​ సిలెండర్లను సీఎం చంద్రబాబు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఏటా 2,684 కోట్ల భారం..

- Advertisement -

ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే ₹2,684 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. ₹2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ.. మొదటి విడత సిలిండర్లకు ఖర్చు అయ్యే ₹894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. ఏడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది.

గ్యాస్​ బుకింగ్స్​ ప్రారంభం..

29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు ప్రభుత్వం కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ.2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement