అమరావతిలోని సచివాలయంలో (బుధవారం) ఏపీ మంత్రిమండలి భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సారి భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఇక దీపావళి నుంచి మహిళలకు కానుక ఉచిత వంట గ్యాస్ ఇచ్చే పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
క్యాబినెట్ లో వీటికి కూడా ఆమోదం..
- భోగాపురం ఎయిర్ పోర్టు పేరును మార్చేందుకు క్యాబినెట్ నిర్ణయం
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ‘స్టెమీ’ పథకం
- ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు
- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన
- రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు, కార్పస్ ఫండ్ గా రూ.10 కోట్లు
- ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం
- రూ.1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్-పిలానీ విద్యాసంస్థ స్థాపనకు చర్యలు
- కౌలు కార్డుల నమూనా మార్చాలని క్యాబినెట్ నిర్ణయం. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డుల జారీ
- పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం
- మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం