Tuesday, December 3, 2024

Srisailam | దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సదుపాయం…

నంద్యాల బ్యూరో, నవంబర్ 21 : కర్నూలు జిల్లాలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కోసం దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల మేరకు… స్వామి వారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వారి వాహనాల‌ ద్వారా శ్రీశైలం రావడం జరుగుతుంద‌న్నారు.

మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి, శ్రావణమాసం, వినాయక చవితి, దసరా, కార్తీకమాసం వంటి పర్వదినముల యందు వారాంతపు రోజుల్లో భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తున్నారు. భక్తుల వాహనములకు ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు పార్కింగ్ ప్రదేశాల‌కు తరలించుట జరుగుతుందని తెలిపారు.

భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజుల్లో అనగా ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతి అరగంట సమయంనకు ఒక పర్యాయం గణేష్ సదన్ నుంచి అన్నదాన భవనం మీదుగా క్యూ కాంప్లెక్స్ వరకు భక్తులను చేరవేయుటకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయుచున్నట్లు ఈవో తెలిపారు. నేటి నుంచి ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం చేరవేసేందుకు ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement