బత్తలపల్లి, (శ్రీసత్యసాయి) ప్రభన్యూస్: అనంతపురానికి చెందిన దంపతులకు విదేశీ కరెన్సీ ఆశ చూపి బీహార్‌కు చెందిన ఓ జంట తమ వద్ద దుబాయ్ కరెన్సీ ఉందని మార్చుకుని సొమ్ము చేసుకోవాలని నమ్మబలికి ఘరానా మోసం చేశాడు, ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం పట్టణం పాతవూరులోని తాడిపత్రి బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్‌లో మజాహన్ అహ్మద్ చెప్పుల దుకాణంతో పాటు కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు.
సలీం అనే వ్యక్తి వచ్చి పరిచయం చేసుకున్నాడు. తనది బీహార్ రాష్ట్రమని, తాము పెయింటింగ్ పనులు చేస్తూ ఉండేవాడు.. తన వద్ద దుబాయ్ కరెన్సీ ఉందని మీరు రూ.8 లక్షలు ఇస్తే, మీకు రూ. 16 లక్షలు విలువ చేసే దుబాయ్ కరెన్సీ అప్పగిస్తానని ఆశ చూపాడు. సలీం దుబాయ్ నోటు ఒకటి పరిశీలనకు ఇచ్చాడు. నోటును పరిశీలించుకున్న మజాహర్ అహ్మద్ తన భార్య ఫరీదాతో కలిసి రూ.8 లక్షలు తీసుకుని ఆదివారం బత్తలపల్లిలో ఉన్న సలీంకు అందజేశాడు.
దుబాయ్ డబ్బు అంటూ సలీం ఓ బ్యాగు అందించి ద్విచక్రవాహంలో పరారయ్యారు. వారు వెళ్ళిపోగానే మజాహర్ అహ్మద్ బ్యాగు తెరిచి చూడగా అందులో పాత న్యూస్ పేపర్లు చూసి తాము మోసపోయామంటూ బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉండగా మోసం చేసిన సలీంకు సంబంధించిన వ్యక్తులు మరో ఏడుగురు పక్కన వ్యాన్లో ఉండి ఇదంతా పర్యవేక్షించినట్లు తెలిసింది.