Friday, November 22, 2024

Fourth Phase – రేపే నాలుగో విడ‌త ఎన్నిక‌ల‌కు నోటిపికేష‌న్

పది రాష్ర్టాల‌లోని 96 లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు
తెలంగాణ 17 స్థానాల‌కు, ఎపిలోని 25 సీట్ల‌కూ నోటిఫికేష‌న్
ఎపి అసెంబ్లీకి సైతం నాలుగో విడ‌తలో ఎన్నిక‌లు
రేప‌టి నుంచే నామినేష‌న్ స్వీక‌ర‌ణ
మే 13న పోలింగ్..జూన్ 4న కౌంటింగ్

న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నిలకు సమయం దగ్గరపడింది. మొత్తం 7 దశల్లో దేశంలోని అన్ని లోకసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16న సార్వత్రిక ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేయడంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకుగానూ ఇదివరకే 3 దశల ఎన్నికల నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం .

- Advertisement -

నాల్గవ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్ ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1). స్థానాల‌కు నాలుగో ద‌శ‌లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి . దీనికోసం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రేపు విడుద‌ల కానుంది. దీంతో ఆ రోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలుకు గడువు ఇచ్చింది ఈసీ. ఇక ఈ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. చివరికి ఈ29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఇదే దశలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4 న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం.

ఏపీ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్:

ఎన్నికల నోటిఫికేషన్ జారీ – ఏప్రిల్ 18
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం – ఏప్రిల్ 18
నామినేషన్లు దాఖలుకు తుది గడువు – ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 26
నామినేషన్ల ఉప సంహరణ – ఏప్రిల్ 29
ఏపీ, తెలంగాణలో ఎన్నికలు – మే 13
ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన – జూన్ 4

Advertisement

తాజా వార్తలు

Advertisement