బంగారుపాళ్యం, ప్రభన్యూస్: బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన నలుగురు మహిళలు వాగులో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గురువారం రాత్రి సుమారు 8.30గం సమయంలో శ్రీనిధి ఫుడ్స్ లో పనిచేస్తున్న టేకుమందకు చెందిన లక్ష్మీదేవమ్మ, కస్తూరమ్మ, ఉషారాణి , జయంతి, శిరీష, చిలకమ్మ, శ్రీను వీరు విధులు ముగించుకొని రాత్రి 7గం సమయo అప్పుడు ఆటోలో స్వగ్రామం బయలు దేరారు. బలిజపల్లి నుండి టేకుమంద వెల్లె రోడ్డుకు రాగానే కాజ్వే పై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆటో డ్రైవర్ అక్కడే ఆపేసి కూలీలను దించశాడు వెళ్లిపోయాడు. వీళ్ళు ఎలాగైనా ఊరికి పోవాలని కలసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని జయంతి వద్ద గల కాజ్ వే దాటెందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో లక్ష్మీదేవమ్మ (40), కస్తూరమ్మ (40), ఉషారాణి (45),జయంతి (45)లు నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
శ్రీను, శిరీష, చిలకమ్మ ఈ ప్రమాదం నుండి బయట పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్థుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు నుండి ప్రత్యేక బలగాలను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరంగా ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో గాలించారు తెలిపారు.శుక్రవారం పాలమాకులపల్లి వద్ద జయంతి 45 మృత దేహం దొరకడం తో ఆమెను పోస్టుమాస్టమ్ నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు మిగిలిన ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital