ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నర్సాపూర్-యశ్వంతపూర్-నర్సాపూర్ మధ్య నాలుగు ప్రత్యేక ట్రైన్ సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈమేరకు బుధవారం ప్రజా సంబంధాల అధికారి రాకేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం రోడ్, అకివీడు, కైకలూర్,, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, నంద్యాల్, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, హెలహంక స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఆ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఎసి, థర్డ్ ఎసి, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని తెలిపారు. కాగా నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు మధ్య రైలు సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement