Wednesday, November 20, 2024

ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. వైసీపీ ఖాతాలో మరో మూడు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాజ్యసభకు ఈనెల 10న జరుగనున్న ఎన్నికల సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి అధికార వైకాపాకు చెందిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికలాంచనం కానుంది. దీంతో రాజ్యసభలో అధికార వైకాపా ఖాతాలో మరో మూడు స్థానాలు జతకానున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఏకగ్రీవంగా ఎన్నికయినవారిలో వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్‌ రావు, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ఉన్నారు. కాగా నామినేషన్ల గడువు చివరిరోజు మే నెల 31వ తేదీ మ.3 గంటల వరకు వైకాపా అభ్యర్థులు తప్ప వేరేవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. అయితే వైకాపా అభ్యర్థులు వేసిన నామినేషన్లను బుధవారం పరిశీలించారు.

కాగా జూన్‌ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీ-లో లేకపోవడంతో వీరినే ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించాల్సివుంది వుంది. ఇదిలా ఉండగా శాసనసభలో అధికార వైకాపాకు 150 మంది సభ్యుల బలం ఉంది. తెదేపాకు సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటు-న 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు- అవసరం. తెదేపాకు సంఖ్యా బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీ- చేయలేదు.. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement