Tuesday, November 26, 2024

Follow up : బెజవాడ ప‌టాకుల‌ పేలుడు ఘటనలో నలుగురు అరెస్టు..

అమరావతి, ఆంధ్రప్రభ : బాణసంచా పేలుడులో ఇద్దరు సజీవ దహనం ఘటనకు సంబంధించి నిజానిజాలను పోలీసులు నిగ్గుతేల్చారు. కాలం చెల్లిన పాత మందుగుండు సామాగ్రి బ్లాస్ట్‌ కావడంతో భారీ ప్రమాదం సంభవించిందని, నిర్వహకులు భారీగా అనుమతి లేని బాణాసంచాను దిగుమతి చేసుకుంటున్న క్రమంలో పీడనం వల్ల పేలుడు ఏర్పడిందని అధికారులు స్పష్టం చేశారు. ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైన అంశాల మేరకు ఇద్దరు షాపు యజమానులతోపాటు అక్రమంగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. లైసెన్స్‌ పొందిన బాణాసంచా తోపాటు స్వంత తయారీ దేశీయ ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేశారని నిందితులపై ప్రధాన ఆరోపణ.

దీపావళి పండుగ ముందురోజు ఈనెల 23వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండులో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయాలు షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు వ్యక్తులు స జీవంగా దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీసులు స్టేషన్‌ నందు -కై-మ్‌ నెంబర్‌ 586/2022 సెక్షన్‌ 285 , 304 పార్ట్ 2, సెక్షన్‌ 3 అండ్‌ 5 ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సబ్‌స్టన్స్‌ యాక్ట్‌ 1908 అండ్‌ సెక్షన్‌ 9 (బి) )(1)(ఏ)(బి) ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ యాక్టు 1884 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డీసీపీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement