Thursday, September 5, 2024

Found – న‌ర్పాపురం ఎంపిడివో మృతదేహం ఏలూరులో ల‌భ్యం …

ఎట్టకేలకు ఎంపీడీవో మృతదేహం లభ్యం…
కాలువలో గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్..
తూటి కాడల మధ్య చిక్కుకున్న వెంకటరమణ మృతదేహం..
వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న యంత్రాంగం..

(ప్రభ న్యూస్, మధురానగర్) తొమ్మిది రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీవో వెంకట రమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది. ఈనెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నరసాపురం ఎంపీడీవో మండవ వెంకట రమణారావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది.

ఏలూరు కాలువలో తూడికాడల మధ్య చిక్కుకున్న ఉన్న మృతదేహాన్ని ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. గడచిన నాలుగైదు రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకు వెంకటరమణ మృతదేహం లభ్యమయ్యింది. విజయవాడ మధురానగర్ లో రైల్వే వంతెన పై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండవచ్చని పోలీసుల అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది కాలువలు ముమ్మరముగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తూడికాడల మధ్య చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే గుర్తించిన మృతదేహం వెంకటరమణ దేనిని పోలీసులు నిర్ధారించారు.

. కాగా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వ‌హిస్తున్న ఎం.వెంకటరమణారావు ఈ నెల 15వ తేదిన మిస్పింగ్ అయ్యారు.. ఈ మేరకు ఆయ‌న భార్య కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు పోలీస్ స్టేష‌న్ లో 16 వ తేదిన‌ ఫిర్యాదు చేశారు.

కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీవో వెంకటరమణారావు దంప‌తులు నివాస‌ముంటున్నారు…సెల‌వు రోజుల్లో న‌ర‌సాపురం నుంచి ఇక్క‌డ‌కు ర‌మ‌ణారావు వ‌స్తుంటార‌ని ఆయ‌న భార్య తెలిపింది.. సోమ‌వారం ఉద‌యం మ‌చిలీప‌ట్నం వెళుతున్నాన‌ని చెప్పి వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి రాలేద‌ని పోలీసుల‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లు దీనిపై ప్ర‌త్యేక శ్రద్ధ తీసుకుని ఎంపిడివో అచూకి కోసం ఆదేశాలు జారీ చేశారు.. ద‌ర్యాప్తు బృందాలు చివ‌రిసారిగా విజ‌య‌వాడ‌లోని ఏలూరు కాలువ వ‌ద్ద ఆగిన‌ట్లు గుర్తించారు. దీంతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువ‌లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement