స్వాగతం పలికిన ఈవో కె ఎస్ రామారావు
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చారు. శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా, ఆలయ ఈవో కె.ఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా, ఈవో రామారావు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో తో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎమ్.రత్నరాజు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.