గుంటూరు – వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి నేటి ఉదయం విడుదలయ్యారు.. హత్య కేసులో అరెస్టై 145రోజుల పాటు జైలులో ఉన్నారు.. అతడికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు 10వేల రూపాయిలు పూచికత్తు జైలు అధికారులకు సమర్పించి విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన అతడికి ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, ఆయన అనుచరులు. కాగా, కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా అంబులెన్స్ లో విజయవాడకు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.
- Advertisement -