Thursday, November 21, 2024

AP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ హెచ్చరికలకు డోంట్ కేర్

పూచికత్తు ఇవ్వడానికి స్టేషన్ కు
తాడిపత్రి టౌన్, జులై 20 (ప్రభ న్యూస్) : ఎన్నికల సమయంలో తాడిపత్రిలో చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకుల పై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తాడిపత్రి పట్నంలోకి రాకూడదని కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయించారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ విజయం సాధించి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.

పోలింగ్ నుంచి నేటి వరకు ఈ ఆదేశాలు అమలు అవుతూ వచ్చాయి. మూడు రోజుల క్రితం హైకోర్టు కండిషన్ బెయిల్ ఇరు వర్గాలకు ఇచ్చింది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో జామీను దారులను హాజరు పరిచి బెయిల్ తీసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన కుమారులను అనుమతించేది లేదని, ఒకవేళ వస్తే పెద్దారెడ్డి పంచె ఊడదీసి కొడతానని జేసీ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సవాలు చేస్తూ శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే పోలీసులు ఆయనను తిరిగి అనంతపురానికి బందోబస్తు మధ్య తరలించారు.

అయితే ఈనెల 14న షరతులను తొలగిస్తూ బెయిల్ మంజూరు చేయడంతో పెద్దారెడ్డి జామీను ఇచ్చేందుకు పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు మీడియాతో తెలిపారు. తాడిపత్రిలో టీడీపీ వారు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో జరుగుతున్న దాడులు ఇతర విషయాలపై న్యాయపరంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇదిలా ఉండగా తాడిపత్రి సీఐ నాగేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ని తిరిగి అనంతపురానికి పంపించారు. ఎస్పీ కార్యాలయంలో షూరిటీ ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement