తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నoదుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు.నిన్న నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన నాపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారు.నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నానని అన్నారు. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. సంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారని రవీంద్ర ఆరోపించారు.
గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం ఏమౌతుందో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.మంత్రి పేర్ని నన్ను ఇబ్బంది పెట్టాలని నాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అడిగితే నేనే వచ్చి సమాధానం చెప్పే వాడినని అన్నారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇంటిని చుట్టూ ముట్టి ఎవ్వరిని రానివ్వకుండా చేశారని అన్నారు. అరెస్టులు శాశ్వతం కాదని…పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ రోజులు ఉండరని హెచ్చరించారు. మాపై చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు.కేసులు పెట్టి తాత్కాలికంగా ఇబ్బందులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు కొల్లు రవీంద్ర.