Friday, November 22, 2024

AP: వైసీపీకి మాజీ ఉప ముఖ్యమంత్రి గుడ్ బై..

ఉమ్మడి పశ్చిమ బ్యూరో, ప్రభన్యూస్ : మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆళ్ళ నాని వైసీపీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితమే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా రాజీనామా చేశానని, వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో ఇవాళ‌ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కొద్దికాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టుగా ఆళ్ళనాని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement