Tuesday, November 26, 2024

AP | రఘురామ కేసులో.. మాజీ సీఐడీ ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ !

వైసీపీ నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసులో విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాగా… సాయంత్రం వరకు సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు.

2021 మే నెలలో సీఐడీ రఘురామను కస్టడీలోకి తీసుకున్నప్పుడు సీఐడీ అదనపు ఎస్పీగా విజయ్ పాల్‌ ఉన్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యకు యత్నించారని రఘురామ చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో, ఈ ఏడాది జులైలో కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారమే కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement