వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3నాటికి తనకు ఉన్న భద్రత పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.
జూన్ 3 నాటికి జగన్‌కి 900 మందితో భద్రత ఉందని జగన్ తరఫు న్యాయవాదులు చెప్పారు. కాగా, సెక్యూరిటీ విజన్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం కుదించింది. అయితే, జగన్ కు ప్రాణహాని ఉన్న అంశాన్ని వారు పరిశీలించలేదని…. జగన్ కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, జగన్ కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న వాహనాన్నే కేటాయించమని ఇప్పటికే ఏపీ సర్కారు చెప్పిన విషయం తెలిసిందే.