2024లో బీజేపీ-జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక ఏపీలో విద్యుత్ కోతలు తగ్గాయన్నారు. మోడీ అంటేనే అభివృద్ధి అని, మోడీ అంటే అవినీతి రహిత వ్యక్తి అనీ కొనియాడారు. ఏపీలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రెండూ కుటుంబ పాలన పార్టీలేనని సోము వీర్రాజు అన్నారు. ఏపీ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రమని, అంతా అవినీతి మయం అంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement