Saturday, November 23, 2024

Srikalahasti: శివయ్య సన్నిధిలో విదేశీ భక్తులు..

శ్రీకాళహస్తి ఆలయం, ఫిబ్రవరి 12, ప్రభ న్యూస్ : దక్షిణ కాశి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాహుకేతు పూజలు, రుద్రాభిషేకాలు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం రావడంతో ఆలయ అధికారులు, పాలక మండలి అధ్యక్షుని సూచనతో స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తులకు కంచుగడప వద్ద ఎస్పీఎఫ్ సిబ్బంది, అధికారులు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం రాహుకాలం సమయంలో పూజలు చేసుకోవడం కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు రావడం రోజుకు పెరుగుతుంది. సిబ్బంది వ్యవహార శైలి కూడా మెరుగుపడిందని, దళారులకు అడ్డుకట్ట వేసి సామాన్య భక్తుల సేవలో తరించడం సేవాభావం చూపుతున్నారు.

స్వామివారి సన్నిధిలో ఇటలీ దేశస్తులు..

శివయ్యకు అత్యంత ప్రీతివంతమైన రోజు సోమవారం కావడంతో ఆయన జన్మ నక్షత్రంగా భక్తులు శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దోష నివారణ పోవాలంటే దేశంలో రాహుకేతు పూజల నివారణ జరగాలంటే అది శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే.. కావున ప్రపంచ నలుమూలల నుంచి దోషాలు తొలగించుకునేందుకు ఆలయానికి విచ్చేస్తుంటారు. సోమవారం ఇటలీ దేశానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవార్ల దర్శనం, శివయ్య సన్నిధిలో వారి మతపెద్దలు భక్తులను ఆశీర్వదించడం అభినందనీయమని రాష్ట్రంలో ముఖ దేవాలయమైన తిరుమల, తర్వాత శ్రీకాళహస్తి అని, ఇలాంటి దైవ సన్నిధిలో మనం జన్మనించడం పూర్వజన్మ సుకృతమని స్థానిక భక్తులు హర్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement