Tuesday, November 26, 2024

ఫోన్ అతిగా వాడొద్ద‌న్నందుకు.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్: ఫోన్ అతిగా వాడొద్దు.. చ‌దువుపై దృష్టిపెట్టాల‌ని మంద‌లించినందుకే ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘ‌ట‌న ఇవ్వాల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తిరుప‌తిలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చిత్తూరు జిల్లా తిరుప‌తి న‌గ‌రంలోని కొర్లగుంట మారుతినగర్ లో ఉంటున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. తిరుమలలో వ్యాపారి అయిన‌ బాలాజీ కుమార్తె వాణిశ్రీ (16) ఇంటర్మీడియట్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతోంది. అయితే చదువు మీద శ్రద్ధ చూప‌కుండా ఎక్కువ‌గా ఫోన్ వాడుతుండ‌డంతో తల్లిదండ్రులు మంద‌లించారు. దీంతో ఆమె మ‌న‌స్తాపానికి గురై ఇంటి రెండో అంతస్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. బాలిక తండ్రి బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ జయ స్వాములు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement