Friday, November 22, 2024

Vizianagaram: ప్రజా పంపిణీ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేయాలి : మంత్రులు

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేయాలని, వీటి వినియోగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్ణయించారని మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎం.డి.వీర పాండ్యన్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, శ్రీకాకుళం జే.సి. నవీన్ కుమార్, అనకాపల్లి జే.సి. జాన్వీ, ఆరు జిల్లాల పౌరసరఫరాల అధికారులు, తూనికలు కొలతల అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… దీనిలో భాగంగా చిరు ధాన్యాలు పండించడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించి, వారు చిరుధాన్యాల సాగు చేపట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. చిరు ధాన్యాలు పండించే రైతులకు తగిన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, మద్దతు ధర కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement