Monday, January 6, 2025

Fog : గన్నవరంలో పొగ‌మంచు.. విమాన రాకపోకలకు అంతరాయం

గన్నవరం ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వచ్చిపోయే విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ కష్టం మారినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పేర్కొన్నారు. అందుకు దట్టమైన పొగమంచే కారణమని వెల్లడించారు. గన్నవరం ఎయిర్ పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దీని వలన గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫాగ్ మొత్తం క్లియర్ అయ్యేదాక ల్యాండింగ్ కష్టమే అని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement