ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని సీఎం జగన్ అన్నారు. పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ… స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. అమూల్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందించాలన్నారు. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement