Thursday, September 12, 2024

AP | రైల్వే బ్రిడ్జిపై ఫ్లైఓవర్… త్వరలోనే టెండర్లు

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడ నగరంలో అతి త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరని ఉన్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధి పేర్కొన్నారు. ఎంపిగా గెలిచిన ద‌గ్గ‌ర నుంచి మ‌హానాడు రోడ్డు నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ ఫ్లై ఓవ‌ర్ పైనే దృష్టి పెట్టడం జ‌రిగిందనీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి ఫ‌లితం మ‌హానాడు రోడ్డు నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ వ‌ర‌కు ఆరులైన్ల ఫ్లైఓవ‌ర్ కి, తూర్పు బైపాస్ కి కేంద్ర రోడ్డు జాతీయ ర‌హ‌దారి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ విష‌యంపై ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీ విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా తో మాట్లాడుతూ మ‌హానాడు జంక్ష‌న్ నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ వ‌ర‌కు ఆరు లైన్ల ఫ్లై ఓవ‌ర్ కి సంబంధించి ప‌నులు ప్రారంభించేందుక అనుమ‌తి ల‌భించింద‌న్నారు. ఒక నెల‌రోజుల్లో ఇక్క‌డ వున్న అన్ని శాఖలతో క‌లిసి ఫ్లై ఓవ‌ర్ ఏ విధంగా వుండాల‌నేది నేష‌న‌ల్ హైవే అధికారులు నిర్ణ‌యించ‌నున్నారనీ చెప్పరు.

ఇప్ప‌టికే ఈ ప్లైఓవ‌ర్ కి సంబంధించి డిపిఆర్ సిద్దం అయిందనీ, అయితే మ‌రోసారి రివైజ్డ్ డిపిఆర్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌న్నారు. నెల‌రోజుల్లోపే స‌బ్మిట్ చేస్తార‌ని చెప్పారు. రెండు నెల‌ల్లో టెండ‌ర్ కి రాబోతుంద‌ని, ఫ్రిబ‌వ‌రి, మార్చి నెలల్లో ప‌నులు ప్రారంభం అవుతాయ‌న్నారు. రెండున్నరేళ్ల‌లో ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం పూర్తి అవుతుంద‌ని తెలిపారు. ఈ నిర్మాణం జ‌రిగే లోపు రామ‌వ‌రప్పాడు నుంచి గ‌న్న‌వ‌రం వెళ్లేందుకు రెడియ‌ల్ రోడ్లు కూడా నిర్మించ‌టం జ‌రుగుతుంద‌న్నారు.

ఈ ఫ్లైఓవర్ కి దాదాపు 800 కోట్ల రూపాయ‌లు నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు. తూర్పు బైపాస్ కి సంబంధించి నిధులు మంజూరు మ‌రో రెండు నెల‌ల్లో జ‌రుగుతుందనీ, దానికి సంబంధించి ఎలైన్మెంట్ ప‌నులు మ‌రోసారి చెక్ చేస్తున్నార‌ని తెలిపారు. ఈ తూర్పు బైపాస్ పనులు కూడా మార్చిలోపు ప్రారంభం అయ్యే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు కృషి చేస్తున్నాయ‌ని తెలిపారు. మూడున్న‌రేళ్ల‌లో తూర్పు బైపాస్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

తూర్పు బైపాస్ నిర్మాణం కోసం కేంద్రం రూ 2,500 కోట్లు కేటాయించిన‌ట్లు ఎంపీ కేసినేని శివనాద్ తెలిపారు. మ‌హానాడు జంక్ష‌న్ నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ ప్లై ఓవ‌ర్ కి, తూర్పు బైపాస్ కి అనుమ‌తులిచ్చి నిధులు మంజూరు చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి , కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఇందుకోసం కృషి చేసిన సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -

గ‌త ఇర‌వై రోజులు జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప‌లు రాష్ట్ర స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించ‌టం జ‌రిగిందన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ లో కేంద్ర రోడ్డు, జాతీయ ర‌హ‌దారి మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ని క‌లిసిన స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో ఎక్కువ‌గా వున్న ట్రాఫిక్ స‌మ‌స్య పై చ‌ర్చించ‌టం జ‌రిగింద‌ని తెలిపారు.. ఆ త‌ర్వాత నితిన్ గ‌డ్క‌రీ ని క‌లిసి మ‌హానాడు జంక్ష‌న్ నుంచి నిడ‌మానురు రైల్వే బ్రిడ్జ్ వ‌ర‌కు ఫైఓవ‌ర్ నిర్మిస్తే గ‌న్న‌వ‌రం వెళ్లేందుకు ట్రాపిక్ స‌మ‌స్య తీరుతుంద‌ని విన‌తి ప‌త్రం అంద‌జేసిన విష‌యం ప్ర‌స్తావించారు.

ఎన్డీయే గ‌వ‌ర్న‌మెంట్ లో కేంద్రం రాష్ట్రానికి సాయం చేయ‌టంలో ముందు వుంటుంద‌ని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ కింద విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ ను ప్ర‌యాణీకుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా రాబోయే 50 సంవ‌త్స‌రాల దృష్టిలో పెట్టుకుని మాస్ట‌ర్ ప్లాన్ కేంద్రం రెడీ చేస్తుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ, కేంద్ర ప్ర‌భుత్వం కానీ రాష్ట్ర అవ‌స‌రాల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ప‌ని చేస్తాయ‌ని ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement