Thursday, October 3, 2024

విశాఖ పర్యాటక సిగలో మరో మణిహారం.. త్వ‌ర‌లో ప్లోటింగ్ రెస్టారెంట్..

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌) : విశాఖ పర్యాటకం రంగం సిగలో మరో మణిహారం రాబోతుంది. టూరిజం డెస్టీనీగా పిలిచే విశాఖ అంటే ప్రపంచ పర్యాటకులకూ ఎంతో ఇష్టం. భారత్‌కు వచ్చే ప్రతి పదిమంది విదేశీయుల్లో ఏడుగురు కచ్చితంగా విశాఖలో పర్యటిస్తారు. గత ఏడాది అక్టోబరు 12న తెన్నేటిపార్కుకు కొట్టుకొచ్చిన ఎం.వి.మా కార్గో లోడింగ్‌ నౌక పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ది చేయడానికి నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యాటక ప్రయోజనాల కోసం ప్లోటింగ్‌ రెస్టారెంట్‌గా అభివృద్ది చేయడానికి ప్రతిపాదించారు. అందుకోసం ఏపీటీడీసీ సొంత నిధులతో ఈ నౌకను రూ.1,25.00లక్షలకు ఏపీ టూరిజం కొనుగోలు చేసింది. దీని ద్వారా విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ముత్తంశెట్టి సీఎం,మంత్రిమండల దృష్టిలో ఉంచి మంజూరు చేయించారు.

ప్లోటింగ్‌ రెస్టారెంట్ షిప్‌గా మార్చడానికి, వినోద భాగాలతో ఒక ప్రత్యేకమైన, ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రతిపాదించారు. వాస్తవానికి ఓడ అంచనా వ్యయం రూ.10.50కోట్ల కాగా, నౌక యజమాని మిస్టర్‌ గిల్‌తో ప్రతిపాదనపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఎపీ టూరిజం మేనేజింగ్‌ డైరెక్టర్‌ చేసిన వివరణాత్మక చర్చలు అనంతరం ఓడను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడానికి సంబంధిత అధికారులు నుంచి అన్నీ అనుమతులు పొందారు. అలాగే ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని పర్యాటక మణిహారంగా రూపురేఖలు మార్చడానికి ప్రతిపాదించారు.

సముద్రం ఒడ్డున పర్యాటకులను ప్రత్యేక ఆకర్షణతో నిలిచిన ఈ నౌకలోకి వెళ్లేందుకు తెన్నేపార్కు కింద నుంచి వెదరు కర్రలతో నడక దారి ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా పర్యాటకులను ఆకర్షించేలా నౌకను ఆనుకొని ఉన్న ఇసుక తెన్నెలపై గొడుగులు, గుడారాలు, రెస్సారెంట్లు, పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు నిర్మించనున్నారు. పార్కు చుట్టూ ఆకర్షణీయమైన ల్యాండ్‌ స్కేటింగ్‌, లైటింగ్‌, వాటర్‌ ఫాల్స్‌,పర్యాటకులకు తాగునీరు, పబ్లిక్‌ టాయిలెట్లు మరిన్నె అవసరమౌన మౌళిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

పార్కును మొత్తం 12 విభాగాల్లో ఆధునీకరించనున్నారు. పర్యాటకులు సముద్రం సోయగాలలను వీక్షించేందుకు అనువుగా పార్కు కింద భాగంలో రెల్లిగడ్డి, వెదురు వంటి పర్యావరణ రహితంగా నిర్మాణాలు చేపట్టడానికి పర్యాటక సంస్థ సన్నహాలు చేస్తూంది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి శ్రీనివాసరావుకు నౌక, దాని చుట్టు ఉన్న పార్కు పరిసరాలను ఏవిధంగా ఆధునీకరిస్తమో అనే అంశాలపై 12 విభిన్న రకాల ఛాయా చిత్రాలను మంత్రికి పర్యాటకశాఖ అధికారులు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement