Friday, November 22, 2024

జలదీగ్భందంలో కదిరి.. భయాందోళనలో పట్టన ప్రజలు..

కదిరి, (ప్రభన్యూస్‌): ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు భారీవర్షం పడింది. రెండ రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.వానొచ్చిదంటే చాలు కదిరి పట్టణ ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. మండలంలోని బొరుగుపల్లి మీదుగా విఠలరావుచెరువుకు భారీగా వరదనీరు చేరుకోవడంతో ఉదృతి తాళలేక వర్షపు నీరు పట్టణానికి చేరుకొని ఇళ్ళలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానాదర్గా హైవేపై వర్షపునీరు ఎక్కవుగా ప్రవహిస్తుండంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. భారీవర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కుమ్మరవాండ్లపల్లిలో భారీవర్షం కురవడంతో టింబర్లు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొన్నారు. దీంతో అప్పలుచేసి మూగజీవాలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో భారీవర్షానికి మూగజీవాలు కొట్టుకుపోయాయ‌ని ఆవేధన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షానికి పంటలు పూర్తిగా నేలకొరిగేలా చేసింది. కదిరి మండలంలోని దేవరచెరువు సమీపంలో వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో వంద ఎకరాల వరి పంట పూర్తిగా నేలపాలైంది. వర్షం తాకిడికి పంటపూర్తిగా దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి యేడు వ్యవసాయ జూదంలో ఓడిపోతున్నామని ఈ సారి ఆరుగాలం కష్టించి వరి పంటను సాగుచేశామని వేలకు వేలు పెట్టుబడులు పెట్టామని తీరా పంట వర్షం తాకిడికి నష్టపోవడంతో పెట్టుబడి కూడా చేతికందదని పలువురు అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పలువురు రైతన్నలు వేడుకొంటున్నారు.

ఆదివారం కురిసిన భారీవర్షానికి కారణంగా ఇళ్ళలోకి నీరుచేరిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను మాజీ ఎమ్మెల్యే, కందికుంట వెంకటప్రసాద్‌ అప్రమత్తం చేశారు. మీకు అన్నీరకాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈయన వెంట తెలుగుదేశం పార్టి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భారీవర్షానికి జలసం ద్రమైన కాలనీలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాష పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. వారి సాదకబాధాలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. ప్రభుత్వం బాధితులను అన్నీరకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement