Tuesday, November 26, 2024

AP: కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద పోటు

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో)
కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాలకు నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఈ వరద నిరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి చేరడంతో నీటి ప్రవాహం రోజు,రోజుకి, గంట, గంటకు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టన్ని ఉంచుతూ, బ్యారేజీ 72 గేట్లలోని 40 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి, మిగులు జలాలను కిందికి విడుదల చేస్తున్నారు.

గురువారం ఉదయం 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో లో కూడా 30 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement