Tuesday, November 26, 2024

ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు… 15 గేట్లు ఎత్తివేత

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో -ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తోడు కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. ప్రకాశం బ్యారేజికి ఇన్ ఫ్లో ప్రస్తుతం 21 వేల క్యూసిక్కుల వరదనీరు వస్తుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తో ఉండడంతో అధికారులు దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. మ్యారేజి వద్ద 12 అడుగుల మేర నీటి నిల్వను ఉంచుతూ, దిగువకు మిగులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 21306 క్యూసెక్కులు ఉండగా, కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి అవసరాలకు 10,176 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదే సమయంలో బ్యారేజీ మొత్తం 70 గేట్లకు గాను 15 గేట్లను ఒక అడుగు మేర వ్యక్తి దిగువకు 11,130 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణ మ్యారేజి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement