Monday, November 25, 2024

AP | ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి… రెండో ప్రమాద హెచ్చరిక..

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రోజు రాత్రికి 9.30లక్షల వరకు దిగువకు నీరు విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 9.18 లక్షల క్యూసెక్కులు, కాలువల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునగడంతో కాలువలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న వాగుల నుంచి కృష్ణానదికి వరదనీరు వచ్చి చేరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement