Saturday, November 23, 2024

Flood – కృష్ణమ్మ పరవళ్లు … సాగ‌ర్‌కు పెరిగిన వరద

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నాగార్జున సాగ‌ర్ : నాగార్జున సాగ‌ర్‌కువ‌ర‌ద పోటెత్తింది. శ్రీశైలం నుంచి సాగ‌ర్ వైపు కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తోంది. పెద్ద ఎత్తున నీరు చేర‌డంతో 18గేట్లు ఎత్తి దిగువ‌కు 1.14 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు విడుద‌ల చేస్తున్నారు. సాగ‌ర్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుతం 311.44 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.

క్రస్టుగేట్లు కుడి, ఎడమ కాలువల ద్వారా, జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 1,89,312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా రికార్డు అవుతోంది. పెరిగిన ప‌ర్యాట‌కుల తాకిడి..సాగ‌ర్‌లో 26 గేట్ల‌కు 18 గేట్లు ఎత్తి నీరు దిగువ‌కు విడిచిపెడుతున్నార‌ని స‌మాచారం తెలుసుకున్న ప‌ర్యాట‌కులు అధిక సంఖ్య‌లో వచ్చారు. ఆదివారం కావడం, గేట్లు ఎత్త‌డంతో ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ప‌ర్యాట‌కులతో నాగార్జున సాగ‌ర్ పరిసరాలు సందడిగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement