Friday, September 6, 2024

Flood Monitoring – ప్ర‌తి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ లు … క‌లెక్ట‌ర్ల‌కు హోం మంత్రి ఆదేశం

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత క‌లెక్ట‌ర్ల‌కు హోం మంత్రి ఆదేశం
ప్రాణ న‌ష్టం లేకుండా చూడండి
ప్ర‌తి క్ష‌ణం అప్ర‌మ‌త్తతో ఉండండి..
జ‌గ‌న్ లేఖ‌ల‌పై అనిత మండిపాటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత నేడు అధికారులను అప్రమత్తం చేశారు. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె అక్క‌డి నుంచే ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

జ‌గ‌న్ లేఖ‌లు రాయ‌డంపై ఫైర్

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి, ప్ర‌ధానికి, కేంద్ర హోం మంత్రికి జగన్ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. చిన్నాన్న వివేకా హత్య, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వంటి వాటిపై జగన్ లేఖ రాస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కాగా, జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాకుండా సామన్య ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని అనిత అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరి కంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని… సంయమనం కోల్పోకుండా జగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చిపోవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవరూ చేయొద్దని అనిత చెప్పారు. అరాచక శక్తులను చట్టపరంగానే అణచివేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కూడా గత ప్రభుత్వ విధ్వంసం తాలూకా అవశేషాలేనని అన్నారు. శాంతిభద్రతలను సరిదిద్దేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలకు భరోసా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement