Tuesday, November 26, 2024

ఏజెన్సీని వీడుతోన్న వరద.. గోదావ‌రికి త‌గ్గిన ఇన్‌ఫ్లో

చింతూరు, ప్రభ న్యూస్‌: చింతూరు ఏజెన్సీలో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన గోదావరి వరదలు ఎట్టకేలకు ఏజెన్సీని వీడుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద 72 అడుగుల గరిష్ఠ స్థాయిలో నమోదు అయిన వరద మంగళవారం రాత్రి సమయానికి 49.6 అడుగులకు చేరుకొని మూడవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ కాగా రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణకు చెరువులో ఉంది. ఇది ఇలా ఉంటే చింతూరు మండలంలోని శబరి నది తగ్గుముఖం పట్టి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి వచ్చిన వరద ప్రస్తుతం చింతూరు ప్రధాన సెంటర్‌ రాజీవ్‌ గాంధీ సెంటర్‌ వరకు తగ్గి చింతూరు వాసులకు ఉపశమనం కలిగించింది. కూనవరం మండలంలోని గోదావరి సైతం తగ్గుముఖం పట్టి నెమ్మదిగా వీడుతోంది.

ఎటపాక, విఆర్‌ పురం మండలాల్లో వరద తగ్గుముఖం పట్టి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ వరద తగ్గుదలతో ఆయా మండలాల పరిధిలోని గ్రామాలకు కొంచెం దారులు ఏర్పడి రాకపోకలు పునప్రారంభం అయ్యాయి. ఈ రాకపోకలు కేవలం మండల కేంద్రాలకు మాత్రమే రాకపోకలు ప్రారంభం కాగా ఇంకా నాలుగు మండలాలకు, అంతర్‌ రాష్ట్రాల్రకు మాత్రం రవాణా పునప్రారంభం కాలేదు. మన్యంలో పలు గ్రామాల చుట్టూ వరద నీరు ఇంకా అలాగే ఉండగా రహదారుల పైనే వరద నీరు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో వరదలు ప్రారంభం అయి పది రోజులు గడుస్తున్నప్పటకి నేటికీ ప్రజా జీవనం పూర్తి స్థాయిలో కొలుకోలేదు. ఈ వరద ఇంకా ఏజెన్సీని పూర్తి స్థాయిలో వీడటానికి మరో వారం రోజులు పట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మన్యంలో సంభవించిన వరదలకు పలు ఇళ్ళు దెబ్బతిన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement