ఉమ్మడి మహబాబు నగర్ జిల్లా, ప్రభ న్యూస్ బ్యూరో : కర్నాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ తరలి వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
ప్రియదర్శిని జూరాల జూరాల ప్రాజెక్టు అధికారులు విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీటితోపాటు, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్‌కు నీరు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పాదనకు 33,190 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అలాగే నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 870 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాల్వ ద్వారా 367 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 6.202 టీఎంసీలు కాగా…. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 2.495 టీఎంసీల నీరు ఉందని తెలిపారు.