Monday, November 18, 2024

AP: తుంగభద్రకు పోటెత్తుతున్న వరద… తాగునీటి కోసం విడుదల..

ఆలూరు, జులై 17 (ప్రభ న్యూస్) : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద వచ్చి చేరుతున్నది. బుధవారం డ్యాంలోకి
63,320 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 212క్యూసెక్కులు నమోదైంది.

డ్యాం గరిష్ట నీటినిల్వ 105.788 సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 39.718 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారులు, మాజీ కాలువ సంఘ అధ్యక్షుడు తప్పెట రామ్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. వారు మాట్లాడుతూ… జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం 300 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మికాంత్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement