Friday, October 25, 2024

Flood Flow – కృష్ణమ్మ పరవళ్లు .. నిండు కుండ‌ల్లా జ‌లాశ‌యాలు

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేత
జూరాల‌లో సైతం నీరు విడుద‌ల‌

హైద‌రాబాద్ – కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. ఈ నేపథ్యంలోని కృష్ణాబేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు…

ఈ బేసిన్ లోని శ్రీశైలం జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేశారు అధికారులు.. ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తి్స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటినిల్వ 215.8070 టీఎంసీలకు చేరి నిండుకుండలా మారింది శ్రీశైలం.. ఇక, కుడి గట్టు జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు..

సాగ‌ర్ గేట్లు ఎత్తివేత

మరోవైపు.. శ్రీశైలం డ్యామ్‌ నుంచి పెద్దస్థాయిలో నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. 22 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 2,08,863 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,25,463 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4886 టీఎంసీల నీరు ఉంది.. నాగార్జున సాగర్‌ నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు పంట కాల్వలకు కూడా నీటిని వదులుతున్నారు అధికారులు..

- Advertisement -

జూరాల‌కు వ‌ర‌ద పోటు

జూరాలకు వరద కొనసాగుతుండగా 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 8.949 టీఎంసీలుగా ఉంది.. ఇక, ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటి విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement